పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన పసిడి రేటు

  • హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
  • పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,51,680గా నమోదు
  • కిలో వెండి ధర రూ. 2,69,900గా నమోదు
  • ఇటీవలి గరిష్టాల నుంచి కిందకు దిగివస్తున్న పసిడి ధరలు
భారత ప్రజలు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించిన నేపథ్యంలో, అప్పటి నుంచి పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నెలలో రూ. 1,70,000 వద్ద ట్రేడ్ అయిన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఇప్పటివరకు దాదాపు రూ. 19,000 మేర తగ్గింది. నేడు మంగళవారం కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 10 తగ్గి రూ. 1,51,680 వద్ద నిలిచింది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,39,040గా, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,13,760గా నమోదైంది.

వెండి ధరల్లోనూ స్వల్ప మార్పులు కనిపించాయి. 100 గ్రాముల వెండి ధర రూ. 26,990 పలకగా, కిలో వెండి రూ. 2,69,900 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలకు అనుగుణంగానే ఈ ధరల తగ్గుదల నమోదైనట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

Gold Price
Hyderabad
Narendra Modi
Silver Price
Bullion Market
24 Carat Gold

More Telugu News